Page Loader
లియో మూవీ: కాలినడకన వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్న లోకేష్ కనగరాజ్ టీమ్ 
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోకేష్ కనగరాజ్ టీమ్

లియో మూవీ: కాలినడకన వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్న లోకేష్ కనగరాజ్ టీమ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 12, 2023
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ హీరో దళపతి విజయ్ నటించిన లియో సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇంకా రచయిత రత్నకుమార్ కలిసి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. లియో సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు. ఇంకా ఇతర కీలక పాత్రల్లో సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందిన లియో సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రచయిత రత్నకుమార్ ట్వీట్