Allu Arjun-Trivikram: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమా .. అదిరిపోయిన పోస్టర్ లుక్
ఈ వార్తాకథనం ఏంటి
పుష్ప విజయం తర్వాత, అల్లు అర్జున్ దేశంలో ఒక పెద్ద స్టార్ అయ్యాడు. ఇప్పుడు యావత్ భారతదేశం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ వస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు బన్నీ.
ఈ సినిమా నుంచి ఈ రోజు విడుదలై న టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతొంది. పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
ఇకపోతే, దర్శకడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కి మెమరబుల్ హిట్స్ ఇచ్చాడు. ఇప్పటిదాకా వీరి కాంబోలో జులాయి, S/O సత్యమూర్తి , అలా వైకుంఠపురములో వంటి హిట్ చిత్రాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి.
Details
పాన్ ఇండియా సినిమాగా.. త్రివిక్రమ్- అల్లు అర్జున్ సినిమా
కాగా, అల్లు అర్జున్ పుట్టినరోజు పురస్కరించుకొని త్రివిక్రమ్ దర్శకత్వం లో తదుపరి సినిమా రాబోతోంది.
ఆ సినిమాను ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
హారికా హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో చినబాబు నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.
వీరిద్దరి కాంబోలో వస్తున్న నాలుగో సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోబోతుందని ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది..
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హారికా హాసిని క్రియేషన్స్ చేసిన ట్వీట్
Wishing an amazing actor with great perseverance & dedication to achieve anything on and off screen, the stylish Icon Star of Indian cinema and National Award winner, Our @alluarjun garu a very Happy Birthday ❤️#HappyBirthdayAlluArjun 🌟
— Haarika & Hassine Creations (@haarikahassine) April 8, 2024
Can't wait to work with you again, sir.… pic.twitter.com/BhLfbaynwB