
Lokesh Kanagaraj: రజనీ-కమల్ కాంబోలో లోకేష్ కనగరాజ్ బిగ్ మల్టీస్టారర్..?
ఈ వార్తాకథనం ఏంటి
'కూలీ'తో సూపర్‌హిట్ సాధించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. ఇప్పటికే నటుడు కార్తీతో 'ఖైదీ 2' చిత్రాన్ని లైన్‌లో పెట్టిన ఆయన, ఈ సినిమాకి ముందే మరో పెద్ద ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి లోకేష్ ఒక మెగా మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌లతో కలిసి ఇద్దరు లెజెండరీ నటులను ఒకే వేదికపైకి తీసుకురావడం పెద్ద విశేషంగా మారనుంది.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన
కథ విషయానికి వస్తే, ఇది ఇద్దరు వయసు మళ్లిన గ్యాంగ్‌స్టర్ల చుట్టూ తిరిగే స్టోరీ అని తెలుస్తోంది. వారి ఇమేజ్‌కు తగ్గట్టుగానే స్క్రిప్ట్‌ను లోకేష్ కనగరాజ్ సిద్ధం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ కథను వినగానే రజనీ, కమల్ ఇద్దరూ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక ఈ మల్టీస్టారర్‌ను కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) నిర్మించనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.