Priyamani: లవ్ జిహాద్ ఆరోపణలు.. నా భర్తపై అనవసర వ్యాఖ్యలు బాధించాయి: ప్రియమణి
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి కొనసాగిన అందాల నటి ప్రియమణి, దక్షిణాది చిత్రపరిశ్రమతో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలు తదితర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వివాహం అనంతరం ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంది.
మతాంతర వివాహం కారణంగా తనపై లవ్ జిహాద్ ఆరోపణలొచ్చాయని, తన భవిష్యత్ కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని అనవసర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావించింది.
2017లో ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ప్రియమణి, 2016లో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నట్లు చెప్పింది.
Details
పిల్లల గురించి నెగటివ్ కామెంట్స్
'తమ నిశ్చితార్థాన్ని ఆనందంగా అందరితో పంచుకోవాలనుకున్నానని, కానీ అందుకు భిన్నంగా తనపై ద్వేషపూరిత వ్యాఖ్యలొచ్చాయని చెప్పారు.
లవ్ జిహాద్ ఆరోపణలు కూడా వచ్చాయన్నారు. తమ పెళ్లి విషయంలో ట్రోలింగ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని ఆమె తెలిపారు.
తనకు ఇంకా పిల్లలు పుట్టలేదని, కానీ వారిపై కూడా విమర్శలు రావడం బాధకరమన్నార. తమ పిల్లలు భవిష్యత్తులో ఐసిస్‌లో చేరతారని కొందరు కామెంట్స్ చేశారన్నారు.
తన భర్తపై అనవసరమైన వ్యాఖ్యలు చేయడం అన్యాయమని అనిపించిందన్నారు. ఆయన గురించి సరైన సమాచారం లేకుండానే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Details
సోషల్ మీడియా ట్రోలింగ్‌పై అసహనం
ప్రియమణి తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రతిసారి, దాదాపు 90% కామెంట్స్ తమ పెళ్లిని గురించే ఉంటున్నాయని పేర్కొంది.
ఈ ట్రోలింగ్ వల్ల ఎన్నిసార్లు బాధపడాల్సి వచ్చిందన్నారు.
కానీ తన జీవితాన్ని తనకిష్టమైన విధంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నామని ఆమె స్పష్టం చేసింది.