
Ashish3: ఆశిష్,వైష్ణవి చైతన్య హారర్ థ్రిల్లర్ మూవీకి 'లవ్ మీ'టైటిల్ ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు, ఆశిష్ రెడ్డి దాదాపు రెండేళ్ల తరువాత తన తదుపరి సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు.
కాగా ఆశిష్ తన మూడో సినిమా టైటిల్ ని నేడు ఆడియన్స్ కి తెలియజేసారు.
హర్షిత్ రెడ్డి,హన్షితారెడ్డి,నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శిరీష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ని ఈరోజు దిల్‌రాజు కార్యాలయంలో గ్రాండ్ ప్రెస్‌మీట్‌లో విడుదల చేశారు.
Details
ఆసక్తిని కలిగిస్తున్న పోస్టర్
ఈ హారర్ లవ్ స్టోరీకి "లవ్ మీ" అనే టైటిల్ ని ఖరారు చేశారు.'If You Dare (నీకు ధైర్యం ఉంటే)'అనేది ట్యాగ్ లైన్.
ఈ సినిమా హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందుతుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించనున్నారు.
ఈ చిత్రానికి దిగ్గజ సంగీత విద్వాంసుడు,అకాడమీ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.
ప్రముఖ డీఓపీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు.బ్రిలియంట్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఈ చిత్రానికి పని చేయనున్నారు.
ఈ హర్రర్ లవ్ స్టోరీ కోసం మేకర్స్ గొప్ప టెక్నీషియన్స్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మోషన్ పోస్టర్ లో హీరో వెనుక లేడీ ఘోస్ట్ షాడోతో ఉన్న పోస్టర్ ఆసక్తిని కలిగిస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టైటిల్ లోగో రివీల్ చేస్తున్న దిల్ రాజు
#Ashish3 is #LoveMe - '𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆' ❤️🔥#DilRaju Garu and the team revealed the title logo of the horror romantic film 💥
— Dil Raju Productions (@DilRajuProdctns) February 27, 2024
ICYM the motion poster
▶️ https://t.co/Dp2TSaSMXU
Exciting updates soon!#GhostLove 💘@AshishVoffl @iamvaishnavi04 @mmkeeravaani @pcsreeram pic.twitter.com/WMMxFPShjS