Page Loader
Vettaiyan: తెలుగు టైటిల్‌ పెట్టకపోవడానికి కారణం చెప్పిన 'వేట్టయన్‌' నిర్మాణ సంస్థ
తెలుగు టైటిల్‌ పెట్టకపోవడానికి కారణం చెప్పిన 'వేట్టయన్‌' నిర్మాణ సంస్థ

Vettaiyan: తెలుగు టైటిల్‌ పెట్టకపోవడానికి కారణం చెప్పిన 'వేట్టయన్‌' నిర్మాణ సంస్థ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2024
07:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రజనీకాంత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'వేట్టయన్‌'. దసరా కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. కానీ దీనికి తెలుగు పేరు పెట్టకపోవడంపై నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ వివరణ ఇచ్చింది. ఈ విషయంపై వారు సోషల్‌ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు.

వివరాలు 

ఇతర భాషల్లో కూడా 'వేట్టయన్‌: ది హంటర్‌' పేరుతోనే విడుదల

''తెలుగులో 'వేటగాడు' అనే టైటిల్‌ రిజిస్టర్‌ చేయించాలనుకున్నాం, కానీ ఆ పేరు అందుబాటులో లేకపోవడంతో ఒరిజినల్‌ పేరుతోనే అంటే 'వేట్టయన్‌' పేరుతోనే రిలీజ్‌ చేయబోతున్నాం. ఇతర భాషల్లో డబ్బింగ్‌ చేసినప్పుడు కూడా 'వేట్టయన్‌: ది హంటర్‌' అనే పేరుతోనే విడుదల చేస్తాం. ఎప్పటిలానే తెలుగు ప్రేక్షకులు మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము టాలీవుడ్‌లో ఎంతోమంది ప్రముఖులతో కలిసి పనిచేశాం. 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'సీతారామం' వంటి తెలుగు చిత్రాలను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేశాం. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. లైకా ప్రొడక్షన్స్‌కు తెలుగు భాష, తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు మీడియా, తెలుగు ప్రేక్షకులపై చాలా గౌరవం ఉంది'' అని తెలిపారు.

వివరాలు 

ఈ చిత్రం రన్‌టైమ్‌ ఎంతంటే.. 

ఈ చిత్రాన్ని 'జై భీమ్‌' ఫేమ్‌ టి.జె. జ్ఞానవేల్‌ తెరకెక్కించారు. చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమిళనాడులో గతంలో జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం రన్‌టైమ్‌ 163.25 నిమిషాలు (2 గంటల 43 నిమిషాల 25 సెకన్లు). ఈ సినిమా కన్నడ, హిందీ భాషల్లో కూడా అదే రోజు విడుదల కానుంది.