Page Loader
Hari Hara Veera Mallu: 'హరి హర వీరమల్లు' తొలిపాట విడుదల.. పాటతో అదరగొట్టిన పవన్‌ కళ్యాణ్ 

Hari Hara Veera Mallu: 'హరి హర వీరమల్లు' తొలిపాట విడుదల.. పాటతో అదరగొట్టిన పవన్‌ కళ్యాణ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటిస్తున్న "హరిహర వీరమల్లు" అనే సినిమా ప్రస్తుతం అభిమానుల్లో విశేషమైన అంచనాలను కలిగిస్తోంది. ఈ చిత్రంలో దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయ‌న ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నప్పటికీ, మిగిలిన భాగం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో సాగుతోంది. తాజాగా, ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ అప్‌డేట్ ను పంచుకుంది. ఈ చిత్రంలోని మొద‌టి పాట మాట వినాలి సాంగ్‌ను విడుద‌ల చేసింది. ఈ పాట ప‌వన్ క‌ళ్యాణ్ స్వయంగా పాడటం విశేషం.

వివరాలు 

కథానాయికగా నిధి అగర్వాల్

పాటలో 'మాట వినాలి.. గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి..' అంటూ పాట సాగుతోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి అస్కార్ అవార్డు విన్న‌ర్ ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. "సూర్య మూవీస్" బ్యానర్ పై, ఈ మూవీని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. అంతేకాకుండా, ఈ సినిమా మొదటి భాగం "హరిహర వీరమల్లు-1: ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్" మార్చి 28న ప్ర‌పంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.