
MAD Square: ఓటీటీలోకి 'మ్యాడ్ స్క్వేర్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మించిన తాజా హిట్ సినిమా 'మ్యాడ్ స్క్వేర్' త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది.
గతంలో విడుదలైన 'మ్యాడ్' సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం, ఈ ఏడాది ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది.
మొదటి పార్ట్‌లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, అలాగే సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ ఈ సీక్వెల్‌లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వీరితో పాటు మరికొందరు నటీనటులు ఇందులో భాగమయ్యారు.
Details
ఏప్రిల్ 25న స్ట్రీమింగ్
ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా, నిర్మాణ బాధ్యతలు నాగవంశీ చేపట్టారు.
ఇప్పుడు ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఓటీటీ దారిలోకి అడుగుపెట్టనుంది.
ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ చిత్రం ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.