
Maharaja: చైనాలో సందడి చేసేందుకు సిద్ధమైన 'మహారాజ'.. 40,000 స్క్రీన్‌లలో గ్రాండ్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, విజయ్ సేతుపతి 50వ ప్రాజెక్ట్‌గా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
జూన్ 14న థియేటర్లలో విడుదలైన 'మహారాజ' ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
28 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత, జూలై 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం గ్లోబల్ చార్ట్స్‌లో టాప్ పొజిషన్ దక్కించుకుంది.
తాజాగా 'మహారాజ' చైనాలో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 29న ఈ చిత్రం చైనా వ్యాప్తంగా 40,000కుపైగా స్క్రీన్‌లలో విడుదల కానుంది.
Details
చైనా ప్రేక్షకులను అలరించనున్న మహారాజ
ఇది భారతీయ సినిమాలకు అరుదైన ఫీట్‌గా నిలిచింది. అలీబాబా పిక్చర్స్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తున్నారు.
భారతీయ చిత్రంగా చైనాలో ఇంత పెద్ద స్థాయిలో విడుదలవడం ప్రత్యేకమని చెప్పొచ్చు. ఈ భారీ విడుదలతో చైనా ప్రేక్షకులు భారతీయ సినిమాలను ఎలా స్వీకరిస్తారో అనే ఆసక్తి నెలకొంది.
చైనాలో 'మహారాజ' గ్లోబల్ రేంజ్‌ను మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
40,000 స్క్రీన్‌లలో విడుదల కావడం ఈ చిత్ర విజయ యాత్రకు ఓ మైలురాయిగా నిలుస్తుంది.