Page Loader
Mahesh Babu: మూడోవ నిందితుడిగా మహేశ్ బాబు.. నోటీసులు జారీ చేసిన పోలీసులు!
మూడోవ నిందితుడిగా మహేశ్ బాబు.. నోటీసులు జారీ చేసిన పోలీసులు!

Mahesh Babu: మూడోవ నిందితుడిగా మహేశ్ బాబు.. నోటీసులు జారీ చేసిన పోలీసులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా నోటీసులు జారీ కావడం సినీ వర్గాలతో పాటు వ్యాపార వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరమ్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మహేశ్ బాబును మూడవ ప్రతివాదిగా చేర్చడం గమనార్హం. ఈ వివాదానికి కారణమైనది మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ. ఈ సంస్థకు సంబంధించిన ఓ వెంచర్‌కు మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. పలు ప్రకటనల ద్వారా ఆయన తన ఫోటోలు, మాటల ద్వారా ఆ ప్రాజెక్టును ప్రమోట్ చేశారు.

Details

స్పందించని మహేష్ బాబు టీం

దీనిని నమ్మిన వినియోగదారులు ఆ సంస్థపై నమ్మకం ఉంచి డబ్బులు చెల్లించగా అభివృద్ధి పనుల్లో జాప్యం, వాగ్దానాల ఉల్లంఘన, ప్రాజెక్టు పూర్తికాలేదు అనే కారణాలతో తాము మోసపోయామని బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల వాదన ప్రకారం, మహేశ్ బాబు లాంటి స్టార్ ప్రచారకర్తగా ఉండడం వల్లే తాము ఆ వెంచర్‌పై నమ్మకంతో పెట్టుబడి పెట్టామని, అందుకే ఆయననూ ఈ కేసులో భాగంగా చేర్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇకపోతే ఈ వ్యవహారంపై మహేశ్ బాబు టీం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన తరఫున ఏ విధంగా స్పందిస్తారన్న ఆసక్తికరత అభిమానులలోనే కాదు, పరిశ్రమవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.