NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు /  Mahesh Babu: 'దేవకీ నందన వాసుదేవ'లో స్పెష‌ల్ క్యారెక్టర్ చేస్తున్న మహేశ్ బాబు.?
    తదుపరి వార్తా కథనం
     Mahesh Babu: 'దేవకీ నందన వాసుదేవ'లో స్పెష‌ల్ క్యారెక్టర్ చేస్తున్న మహేశ్ బాబు.?
    'దేవకీ నందన వాసుదేవ'లో స్పెష‌ల్ క్యారెక్టర్ చేస్తున్న మహేశ్ బాబు.?

     Mahesh Babu: 'దేవకీ నందన వాసుదేవ'లో స్పెష‌ల్ క్యారెక్టర్ చేస్తున్న మహేశ్ బాబు.?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 28, 2024
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'హీరో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అశోక్ గల్లా. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva).

    'హను-మాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించారు. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

    ఈ సందర్భంగా, సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

    క్లైమాక్స్‌లో శ్రీ కృష్ణుడి పాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ఉంటాయని, అందులో మహేశ్ నటిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    వివరాలు 

    ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమా 

    ఈ విషయమై మహేశ్‌ను ఒప్పించి షూట్ చేసినట్లు సమాచారం అందుతోంది.

    క్లైమాక్స్‌లో మహేశ్ కృష్ణుడి అవతారంలో దర్శనమివ్వనున్నాడని ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.

    అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవకీ నందన వాసుదేవ' చిత్రం, మానస వారణాసి కథానాయికగా కనిపించనుంది.

    యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు.

    ''ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతోంది. ఇందులో అశోక్ మాస్ యాక్షన్ పాత్రలో కనిపిస్తారని చిత్ర వర్గాలు తెలిపాయి'' అని సమాచారం.

    మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకు సన్నద్ధమవుతున్నారు, ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభమవ్వనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహేష్ బాబు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    మహేష్ బాబు

    కండలు పెరిగేలా మహేష్ బాబు జిమ్ వర్కౌట్లు.. రాజమౌళి సినిమా కోసమేనా అంటూ నెటిజన్ల ప్రశ్నలు  తెలుగు సినిమా
     'సినిమా నా డీఎన్‌ఏలోనే ఉంది'.. మహేష్ బాబు కూతురు ఎమోషనల్‌ పోస్ట్    టాలీవుడ్
    మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోస్.. హాలీవుడ్ హీరోలా ఉన్నారని అభిమానుల కామెంట్స్  తెలుగు సినిమా
    గుంటూరు కారం మొదటి పాట విడుదల ఎప్పుడు ఉంటుందో వెల్లడి చేసిన నిర్మాత  గుంటూరు కారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025