
Mahesh Babu : AMB క్లాసిక్‌గా మారానున్నహైదరాబాద్ లోని మరో థియేటర్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఏషియన్ సినిమాస్ సహకారంతో, మహేష్ బాబు 2018లో థియేటర్ వ్యాపారంలోకి ప్రవేశించారు. దాని ఫలితమే గచ్చిబౌలిలో AMB మల్టీప్లెక్స్.
సినిమా కోసం సింగల్ థియేటర్ల వైపు వెళ్లడం తగ్గించిన జనాలు..టికెట్ ధర ఎక్కువైనా కూడా మల్టీప్లెక్స్ లలోనే సినిమాలను చూస్తున్నారు.
మెయింటైన్ చేయలేక మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఇప్పుడు మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి.
హైదరాబాద్ RTC X రోడ్స్ ఏరియాలో చాలా కాలంగా మూతబడిన ఓ థియేటర్ ను మహేష్ బాబు మల్టీప్లెక్స్ గా మార్చబోతున్నారని సమాచారం.
Details
AMB క్లాసిక్ అనే పేరుతో 7 స్క్రీన్స్ ఉండే మల్టీప్లెక్స్
RTC X రోడ్స్ లోని ప్రముఖ థియేటర్ సుదర్శన్ 70mmని 2010లోనే మూసేసారు.
ఇప్పుడు ఆ థియేటర్ స్థలాన్ని లీజుకు తీసుకొని మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా AMB క్లాసిక్ అనే పేరుతో 7 స్క్రీన్స్ ఉండే మల్టీప్లెక్స్ కట్టబోతున్నారని సమాచారం.
ఈ విషయమై క్లారిటి రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.
ఇక, మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుంది.