Loading...
Varanasi: 'వారణాసి' షూటింగ్‌లో మహేశ్ బాబు పార్ట్ పూర్తి.. అక్టోబర్‌లో టాకీకి ప్యాకప్
'వారణాసి' షూటింగ్‌లో మహేశ్ బాబు పార్ట్ పూర్తి.. అక్టోబర్‌లో టాకీకి ప్యాకప్

Varanasi: 'వారణాసి' షూటింగ్‌లో మహేశ్ బాబు పార్ట్ పూర్తి.. అక్టోబర్‌లో టాకీకి ప్యాకప్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్‌-వరల్డ్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి'. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ గ్లోబ్‌-ట్రాటింగ్ ఎపిక్ డ్రామా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు తన పాత్రకు సంబంధించిన ప్రధాన టాకీ, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేశారు. షూటింగ్ షెడ్యూల్ పూర్తి సెప్టెంబర్ 22తో మహేశ్ బాబు తన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. దీంతో చిత్రబృందం ఆయనకు ప్యాకప్ చెప్పింది. ఇక 'వారణాసి'లో మహేశ్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లే. మిగిలిన షూటింగ్‌ను కూడా అక్టోబర్ మొదటి వారానికల్లా ముగించేలా రాజమౌళి ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రం

'వారణాసి'లో మహేశ్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

అంతర్జాతీయ స్థాయి నటీనటులతో రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమాలో మహేశ్ బాబు పాత్ర, ఆయన నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

రాముడిగా మహేశ్ బాబు

'వారణాసి'లో మహేశ్ బాబు రాముడి పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.

ఈ పాత్రలో ఆయన నటన అభిమానులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి.

భారీ స్థాయిలో రూపొందుతున్న కథ, పాత్రలు, యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది.

వివరాలు 

తుది దశలో పోస్ట్‌ ప్రొడక్షన్

మరోవైపు 'వారణాసి' పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి.

ముఖ్యంగా సీజీఐ, వీఎఫ్‌ఎక్స్ పనులకు చిత్రబృందం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా విజువల్స్‌ను తీర్చిదిద్దుతున్నారు.

షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ADVERTISEMENT