Page Loader
SSMB 29: రెండు పార్టులుగా మహేశ్‌ బాబు, జక్కన్న మూవీ.. రికార్డు బడ్జెట్‌తో చిత్రీకరణ!
రెండు పార్టులుగా మహేశ్‌ బాబు, జక్కన్న మూవీ.. రికార్డు బడ్జెట్‌తో చిత్రీకరణ!

SSMB 29: రెండు పార్టులుగా మహేశ్‌ బాబు, జక్కన్న మూవీ.. రికార్డు బడ్జెట్‌తో చిత్రీకరణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2024
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం దృష్టికి స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి తీసుకెళ్లారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సూపర్‌ హిట్ పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచ బాక్సాఫీస్‌ను ఆయన శాసించాడు. తన రికార్డును తానే అధిగమించే భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఈసారి మహేష్ బాబుతో 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ సినిమా గురించి ఆసక్తికర అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

Details

2027లో మొదటి పార్ట్ రిలీజ్

ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిలువబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబు ప్రత్యేకంగా లుక్ మార్చుకుని, లాంగ్ హెయిర్‌, గడ్డం, పోనీ టెయిల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ స్టైల్‌తో మహేశ్ బాబు సోషల్ మీడియాలో వైరల్‌య్యాయి. దీంతో సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచర్ కానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ గ్లోబల్ అడ్వెంచర్ సినిమాను 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు.