తదుపరి వార్తా కథనం
Mahesh Babu: మరణ మాస్ లుక్ లో మతిపోగొడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 13, 2024
11:21 am
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్‌లో వరుస విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
ఆయన తదుపరి చిత్రం పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రకటన తరువాత, మహేష్ బాబు మరింత చర్చనీయమైన అంశంగా మారారు.సినిమా అప్డేట్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి మహేష్ బాబు నెవర్ బిఫోర్ లాంటి మేకోవర్ తో కనిపిస్తున్నారు.పొడవాటి జుట్టు,గుబురు గడ్డంతో స్టైలిష్ గా ఉన్నారు.
సినిమా కోసం పూర్తిగా సన్నద్ధం అవుతున్నారు.ఈ మధ్య,మహేష్ బాబు తన కుటుంబంతో న్యూయార్క్ నగరానికి వెళ్లారు. తాజాగా హైదరాబాద్ లో అడుగు పెట్టారు.ఈ ట్రిప్‌కు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.