Loading...
Mahesh Babu Revanth Reddy: తెలంగాణ సీఎంతో మహేష్‌బాబు భేటీ...ఇదే కారణమా?
తెలంగాణ సీఎంతో మహేష్‌బాబు భేటీ...ఇదే కారణమా?

Mahesh Babu Revanth Reddy: తెలంగాణ సీఎంతో మహేష్‌బాబు భేటీ...ఇదే కారణమా?

వ్రాసిన వారు Balachander Sharma
Nov 29, 2026
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలవడం ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇద్దరూ భేటీ అయ్యారు. తొలుత మహేష్‌ బాబు సీఎంకు పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా పలకరించారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మహేష్‌ బాబును శాలువాతో సత్కరించారు. ఇద్దరూ కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్న తర్వాత వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఈ సమావేశం ఎందుకు జరిగింది? అసలు ఏ విషయంపై చర్చ జరిగింది? అనే వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ఈ భేటీపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Details

భేటీ వెనుక కారణమేంటన్న ఆసక్తి

సాధారణ మర్యాదపూర్వక సమావేశంగానే కనిపించినప్పటికీ, మహేశ్‌బాబు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అనే చర్చ మొదలైంది.

ముఖ్యంగా తెలంగాణలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలు, షూటింగ్‌లు, సినీ కార్యక్రమాలు లేదా ఇతర విషయాలపై మాట్లాడారా అనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

అయితే ప్రస్తుతం దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అందువల్ల భేటీని ఏదైనా సినిమా నిర్ణయంతో ముడిపెట్టడం తొందరపాటే.

అధికారికంగా ఏ విషయం బయటకు వస్తుందో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే మహేష్‌ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోనే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమాతో బిజీగా ఉన్నారు.

Details

'వారణాసి'పై పెరుగుతున్న అంచనాలు

'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్‌ వరల్డ్‌ మూవీ కావడంతో 'వారణాసి'పై భారీ అంచనాలు ఉన్నాయి.

మహేష్‌ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

2027 ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే భారీ స్థాయిలో జరుగుతున్న వీఎఫ్‌ఎక్స్‌ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అదే నిజమైతే విడుదల తేదీ మారే అవకాశముంది. ఈ నేపథ్యంలో మహేష్‌ బాబు తాజా భేటీకి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT