తదుపరి వార్తా కథనం

'సినిమా నా డీఎన్‌ఏలోనే ఉంది'.. మహేష్ బాబు కూతురు ఎమోషనల్ పోస్ట్
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Oct 14, 2023
12:01 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని వారసత్వాన్ని నెలబెడుతోంది. శుక్రవారం నేషనల్ సినిమా డే సందర్భంగా సితార ఓ ఫోటో పోస్ట్ చేసింది. దాంతోపాటు మరికొన్ని విషయాలను తన ఇన్‌స్టాలో పంచుకుంది.
సినిమా అంటే కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదన్న సితార, సినిమా అనేది తన డీఎన్‌ఏలోనే ఉందని కుండబద్దలు కొట్టింది.
లెజండరీ, ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న తన తాతగారు తమను ఎంతగానో ప్రభావితం చేసినట్లు సితార చెప్పుకొచ్చింది.
ఆయన వారసత్వంలో తాము భాగమైనందుకు గర్వపడుతున్నామని, తాతయ్యను నాన్న స్ఫూర్తిగా తీసుకున్నారని, తాను కూడా అలాగే చేస్తానని వివరించింది.
నాన్నే తన స్ఫూర్తి అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.