Page Loader
మహేశ్ బాబు కుమార్తె యాడ్ ఫోటోలు ఇవే..టైమ్స్ స్క్వేర్ పై మెరిసిన సితార
టైమ్స్ స్క్వేర్ పై సితార తొలి కమర్షియల్ యాడ్

మహేశ్ బాబు కుమార్తె యాడ్ ఫోటోలు ఇవే..టైమ్స్ స్క్వేర్ పై మెరిసిన సితార

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 04, 2023
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహేశ్ బాబు కుమార్తె సితార తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటోంది. ఈ మేరకు సితార కలెక్షన్స్ లో భాగంగా పీఎంజే జువెల్లరీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తన తొలి కమర్షియల్ యాడ్ ను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో లాంచ్ చేసింది. తెలుగు సాంప్రదాయ వస్త్రాధారణతో అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ తెరపై సితార తళుక్కుమని మెరిసింది. యాడ్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇవాళ అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమ అభిమాన హీరో గారాల పట్టిని టైమ్స్ స్వ్కేర్‌ స్క్రీన్ పై చూసి ఫ్యాన్స్ గర్వపడుతున్నారు. చదువులు, ఆటలు, పాటలే కాదు నటనా రంగంలోనూ తాను రాణించగలనని సితార చాటి చెబుతోంది.

DETAILS

 స్టార్‌ కిడ్ గా గుర్తింపు సాధించిన  సితార 

సితార యాడ్‌ కోసం 3 రోజులు పాటు షూటింగ్ చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మహేశ్‌ బాబు టీమ్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు, ఘట్టమనేని సితార తొలి కమర్షియల్‌ యాడ్‌ ను ప్రారంభించడం పట్ల ఘట్టమనేని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. లిటిల్‌ ప్రిన్సెస్‌ ఫస్ట్ యాడ్‌ను అమెరికాలోని టైమ్స్ స్వ్కేర్‌పై చూసి మహేశ్‌ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. అతి చిన్న వయసులోనే కమర్షియల్‌ యాడ్‌ స్టార్‌ కిడ్ గా సితార గుర్తింపు సాధించింది. ఫలితంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ఫ్యామిలీ క్లౌడ్‌ నైన్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సితార కలెక్షన్స్ లాంచ్ చేసిన పీఎంజే జువెల్లర్స్