SSMB 29 : మామూలుగా లేడుగా.. మహేశ్ బాబు కొత్త లుక్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు బయట ఎక్కడా కనిపించడం లేదు.
ఎవరూ ఊహించని విధంగా, ఆయన ఫారిన్ టూర్లకు కూడా వెళ్లడం లేదు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'SSMB 29' గురించి ఎలాంటి లుక్ రివీల్ కాకుండా మహేశ్ బాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన ఒక లీకేజీ బయటకొచ్చింది. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి రాజమౌళి, మహేశ్ బాబును సింహంతో పోలుస్తూ వివిధ రకాలుగా హింట్స్ ఇస్తూ వచ్చారు.
లొకేషన్ రెక్కీకి వెళ్లినప్పుడు, మహేశ్ పాస్‌పోర్ట్ గురించి మాట్లాడినప్పుడూ, ప్రతిసారీ సింహానికి సంబంధించిన సూచనలను సోషల్ మీడియాలో పంచారు.
దీంతో ఈ సినిమా కథలో మహేశ్ పాత్రపై భారీ ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
Details
సంతోషంలో మహేష్ ఫ్యాన్స్
అయితే ఇప్పటివరకు అధికారికంగా షూటింగ్ మొదలైందా లేదా అన్నది స్పష్టత లేదు.
అలాగే మహేశ్ బాబు లుక్ ఎక్కడా బయటకు రాలేదు. కానీ తాజాగా మహేశ్ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి లీక్ అయ్యింది.
ఈ వీడియో కేవలం 14 సెకన్ల పాటు ఉండగా, అందులో మహేశ్‌ను చూస్తే సింహంలా జూలు విదిల్చినట్టుగా, వేటకు సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నాడు.
భారీ గడ్డం, పొడవైన జుట్టుతో మహేశ్ మామూలుగా లేడని అభిమానులు అంటున్నారు. ఈ లీక్‌డ్ లుక్ చూసిన మహేశ్ అభిమానులు రాజమౌళి, మహేశ్ కాంబో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని భావిస్తున్నారు.
ఫస్ట్ లుక్ బయటకు వస్తే ఏ స్థాయిలో హంగామా ఉంటుందో ఊహించుకోవచ్చు!
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
Babbooooiii aa hair enti annna 🥵📈#SSMB29 📈 @urstrulyMahesh pic.twitter.com/h3rCUlJzKn
— Mahesh Babu (@kiran__DHFM) February 27, 2025