Page Loader
Chhaava: మహేష్ బాబు 'ఛావా' చేయాల్సింది.. కానీ ఎందుకు మిస్ అయ్యారో తెలుసా?
మహేష్ బాబు 'ఛావా' చేయాల్సింది.. కానీ ఎందుకు మిస్ అయ్యారో తెలుసా?

Chhaava: మహేష్ బాబు 'ఛావా' చేయాల్సింది.. కానీ ఎందుకు మిస్ అయ్యారో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2025
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన 'ఛావా' సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈచిత్రాన్ని దివ్యాంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్ నిర్మించగా, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో కనిపించారు. ఫిబ్రవరి 14న విడుదలైన 'ఛావా' గ్రాండ్ ఓపెనింగ్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటగా ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్ పాత్ర కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును సంప్రదించారట.

Details

కొంతకాలం పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం

కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదట. దీంతో దర్శకుడు ఈ కథను కొంతకాలం పెండింగ్‌లో పెట్టి, తర్వాత హీరోగా విక్కీ కౌశల్‌ను ఎంచుకున్నారు. కథ విన్న వెంటనే విక్కీ ఓకే చెప్పడంతో 'ఛావా' సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఇక హీరోయిన్ విషయంలోనూ మొదట కత్రిన కైఫ్‌ను సంప్రదించగా, ఆమె ఈ చిత్రానికి నో చెప్పడంతో చివరికి రష్మిక మందన్నను ఎంపిక చేశారు. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఈ సినిమా చేసుంటే, ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మరింత ఫాలోయింగ్ పెంచుకునేవారేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ రూమర్స్‌లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.