Page Loader
Mahesh Babu : షూటింగ్, వెకేషన్ కోసం ఫ్యామిలీతో దుబాయ్‌కి వెళ్లిన మహేష్ బాబు
షూటింగ్, వెకేషన్ కోసం ఫ్యామిలీతో దుబాయ్‌కి వెళ్లిన మహేష్ బాబు

Mahesh Babu : షూటింగ్, వెకేషన్ కోసం ఫ్యామిలీతో దుబాయ్‌కి వెళ్లిన మహేష్ బాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2023
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్‌లో 'గుంటూరు కారం' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సంకాంత్రికి వచ్చేందుకు రెడీగా ఉంది. ఈ ఏడాది మహేష్ బాబు నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఈ మూవీ కోసం ప్రేక్షకులు అతృతుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక ఫైనల్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా విరామం తర్వాత ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు దుబాయికి బయల్దేరాడు. అక్కడ ఒక యాడ్ షూటింగ్ కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.

Details

రెండు రోజులు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయనున్న మహేష్ బాబు

ఈ యాడ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత అక్కడే ఒకటిరెండు రోజులు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయనున్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మహేష్ బాబు, నమ్రత, గౌతమ్, సితార బయల్దేరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు నెట్టింట్ వైరల్‌గా మారాయి. ఈ మూవీలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిలీం సిటీలో మహేష్, శ్రీలీల పై ఓ మాస్ సాంగ్‌ని షూట్ చేసిన విషయం తెలిసిందే.