LOADING...
Mahesh Babu: 'లిటిల్ హార్ట్స్'పై ఫిదా అయిన మహేశ్ బాబు.. సంగీత దర్శకుడికి స్పెషల్ మెసేజ్
'లిటిల్ హార్ట్స్'పై ఫిదా అయిన మహేశ్ బాబు.. సంగీత దర్శకుడికి స్పెషల్ మెసేజ్

Mahesh Babu: 'లిటిల్ హార్ట్స్'పై ఫిదా అయిన మహేశ్ బాబు.. సంగీత దర్శకుడికి స్పెషల్ మెసేజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2025
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

చిన్న మూవీగా విడుదలైన 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా ఈ మూవీ మాయలో మునిగిపోయారు. ఎక్స్ (X) వేదికగా ఈ మూవీపై ఆసక్తికర పోస్టు చేశారు. లిటిల్ హార్ట్స్ ఆద్యంతం ఎంజాయ్ చేసేలా ఉన్న వినోదభరితమైన చిత్రం. నటీనటులంతా కొత్తవారే అయినా అద్భుతంగా నటించారు. నవ్వులు పూయించే రైడ్ ఈ మూవీ. ముఖ్యంగా సంగీత దర్శకుడు సింజిత్‌.. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్‌. ఎందుకంటే రాబోయే రోజుల్లో నువ్వు చాలా బిజీ అవుతావ్ అని మహేష్ బాబు రాసుకొచ్చారు.

Details

ప్రత్యేకంగా సంగీత దర్శకుడిపై ప్రశంసలు

ప్రస్తుతం మహేశ్ బాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మహేశ్ ప్రత్యేకంగా సంగీత దర్శకుడు సింజిత్ (Sinjith Yerramilli) పేరును ప్రస్తావించడం వెనుక ఓ కారణం ఉంది. ఇటీవల సింజిత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను మహేశ్ బాబుకు పక్కా వీరాభిమాని అని తెలిపారు. అంతేకాదు 'లిటిల్ హార్ట్స్' గురించి మహేశ్ బాబు ఒక పోస్ట్ పెడితే ఆనందంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్లిపోతానని కూడా అన్నాడు. అందుకే మహేశ్ తన పోస్ట్‌లో ఫన్నీ స్టైల్లో సింజిత్‌ను ఉద్దేశించి స్పందించినట్టు తెలుస్తోంది.