LOADING...
Santosh K Nair: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి

Santosh K Nair: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి

వ్రాసిన వారు Moogati Shabari
May 05, 2026
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సినిమా పరిశ్రమను తీవ్ర విషాదం చుట్టుముట్టింది. ప్రముఖ సీనియర్ నటుడు సంతోష్ కె. నాయర్ (65) కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పతనంతిట్ట జిల్లా ఏనతు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వచ్చిన లారిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన భార్య శుభశ్రీ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో సంతోష్ నాయర్‌కు గుండెపోటు రావడంతో పరిస్థితి మరింత విషమించి ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన భార్యకు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కొనసాగుతోంది.

వివరాలు

100పైగా చిత్రాల్లో నటించిన సంతోష్

సంతోష్ నాయర్ 1982లో 'జ్ఞాంగళుడే కథ' సినిమాతో చిత్రరంగంలో అడుగుపెట్టారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన తన సినీ ప్రయాణంలో ఆయన 100కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రతినాయకుడిగా మాత్రమే కాకుండా, హాస్య పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన నటించిన చివరి చిత్రం 'మోహినియాట్టం' ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శింపబడుతుండగానే ఈ విషాదం చోటుచేసుకోవడం బాధాకరం. సంతోష్ నాయర్ మృతి పట్ల మలయాళ సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, నటులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

Advertisement