
Drugs case: డ్రగ్స్ కేసులో మలయాళం దర్శకుల అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ చిత్రపరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు షైన్ టామ్ చాకో అరెస్టు అయిన విషయం తెలిసిందే.
తాజాగా ఎక్సైజ్ అధికారులు మరో ఇద్దరు ప్రముఖ దర్శకులను అరెస్టు చేశారు. ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజా వారి స్నేహితుడు షలీఫ్‌ను కొచ్చిన్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
శనివారం అర్ధరాత్రి ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజా నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో కొద్దిమొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Details
గంజాయి సరఫరా చేసే వ్యక్తులపై కూడా విచారణ
ప్రాథమిక విచారణలో, ఈ ముగ్గురు వ్యక్తులు కొన్ని సంవత్సరాలుగా గంజాయి తీసుకుంటున్నట్లు వెల్లడైంది.
వారు చిత్రలహరికి సంబంధించిన చర్చల సమయంలో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండటం గమనార్హం. అయితే వారికే గంజాయి సరఫరా చేసే వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతోంది.
ఖలీద్ రెహమాన్ ఇటీవల విడుదలైన 'జింఖానా' చిత్రానికి దర్శకత్వం వహించగా, అష్రఫ్ హంజా 'తమాషా' చిత్రంతో గుర్తింపు పొందాడు.