Mallareddy : మహేశ్ బాబు గారూ.. నీ సినిమా చూసే ఎంపీ అయిన
హైదరాబాద్ మహానగరం శివారులో మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా సోమవారం రాత్రి యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందుకోసం సినిమా బృందం సైతం వచ్చేసింది. ఈ ఈవెంట్‌లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. 'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా సినిమా గురించి, మహేశ్ బాబు గురించి మల్లారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బిజినెస్ మ్యాన్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఆ సినిమా 10 సార్లు చూసి ఎంపీనయ్యానన్నారు. 'యానిమల్' బ్లాక్ బస్టర్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా, రణ్ భీర్ కపూర్, రష్మిక మందన్న సహా ఇతర తారగణానికి అభినందనలు తెలియజేశారు.
రణ్ భీర్ జీ, మీరు హైదరాబాద్ ఫిఫ్ట్ అవ్వాలి : మంత్రి మల్లారెడ్డి
అనంతరం రణ్ భీర్'ని ఉద్దేశించి వచ్చే ఏడాది హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని కోరారు. ముంబాయ్ పాతది అయిపోయిందన్నారు. బెంగుళూరులో ట్రాఫిక్ జామ్ ఉంటుందని, హిందుస్తాన్‌లో మిగిలింది ఒక్కటే నగరమని, అదీ హైదరాబాద్ అన్నారు. ఇదే సమయంలో రష్మిక చాలా స్మార్ట్ అని మల్లారెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే ఆయన స్పీచ్‌లో తెలుగువారి గురించి గొప్పగా పొగిడారు. వచ్చే ఐదేళ్లలో బాలీవుడ్, హాలీవుడ్ అన్నింటిని తెలుగువారు ఏలేస్తారు. తెలుగులో చాలా స్మార్ట్ మనుషులు ఉన్నారన్నారు. రాజమౌళి, దిల్ రాజు వంటి వారు తెలుగులో ఉన్నారని, ఇప్పుడు కొత్తగా సందీప్ కూడా చేరాడన్నారు. అందుకే హైదరాబాద్ టాప్ మోస్ట్ అయిందన్నారు. తెలుగు వారు స్మార్ట్ అని చెప్పేందుకు రష్మికనే ఉదాహరణ అన్నారు. పుష్పతో అదరగొట్టేసిందన్నారు.
రూ.500 కోట్లు వసూలు అవుతాయి : మల్లారెడ్డి
మరోవైపు మల్లారెడ్డి వర్సిటీలో చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు తయారవుతున్నారని, ఇది పవిత్రమైన భూమి అన్నారు. నాలుగేళ్ల క్రితం ఈ నేలపై అశ్వమేథ యాగం జరిగిందన్నారు. ఇక్కడ మీ సినిమా రిలీజ్ అవుతుంది కనుక కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు.యానిమల్ సినిమాకు రూ.500 కోట్ల మేర కలెక్షన్స్ రావాలని మల్లారెడ్డి అభిలాషించారు. డిసెంబర్ 1న 'యానిమల్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. రణ్ బీర్ కపూర్‌కు జోడీగా రష్మిక నటించగా, హీరో తండ్రి పాత్రలో అనిల్ కపూర్ మెరిశారు.విలన్ పాత్రలో బాబీ డియోల్ మెప్పించాడు. 3 గంటల 21 నిమిషాల వ్యవధి గల ఈ సినిమా, నిడివి ఎక్కువగా ఉంది.దీంతో సందీప్ మీద నమ్మకంతో ప్రేక్షకులు 'యానిమల్'ను కోసం ఎదురుచూస్తున్నారు.