LOADING...
Mammootty : మెగాస్టార్ సినిమాలో కన్నడ విలన్‌.. ఎవరో తెలుసా
మెగాస్టార్ మమ్ముట్టి సినిమాలో కన్నడ విలన్‌.. ఎవరో తెలుసా

Mammootty : మెగాస్టార్ సినిమాలో కన్నడ విలన్‌.. ఎవరో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 22, 2023
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తదుపరి సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు విలన్ పాత్రలో నటించనున్నారు. ఈ మేరకు నటుడు రాజ్ బీ శెట్టి ప్రతినాయకుడి పాత్రలో అలరించనున్నారు. మలయాళ స్టార్ హీరో ఇటీవలే కన్నూర్ స్క్వాడ్‌తో అదరగొట్టారు. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేసింది. ఇదే సమయంలో నవంబర్ 23న, మమ్ముట్టి కాదల్ బిగ్ స్క్రీన్‌లోకి రానుండటం విశేషం. ప్రస్తుతం మమ్ముట్టి వైశాఖ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ కామెడీ టర్బో షూటింగ్‌లో మునిగిపోయారు. అయితే గరుడ గమన వృషభ వాహనం, టోబి చిత్రాల్లో శెట్టి అద్భుతంగా నటించి పేరు ప్రఖ్యాతలు సాధించారు. టర్బో సినిమాలో శెట్టి విలన్‌గా నటించనున్నట్లు చిత్ర నిర్మాణ బృందం ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాలీవుడ్ మెగాస్టార్ మూవీలో కన్నడ విలన్