Manchu Family: మంచు విష్ణు పై మంచు మనోజ్ ఫిర్యాదు
గత వారం నుంచి మంచు కుటుంబ వివాదం తగ్గినట్లు అనిపించినప్పటికీ, తాజాగా మరో గొడవ తెరపైకి వచ్చింది. మంచు విష్ణు, వినయ్ మహేశ్వర్‌పై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో ఏడు పేజీల వివరాలను చేర్చి, విష్ణు వల్ల తనకు ప్రాణ హాని ఉందని పేర్కొన్నాడు. దీంతో మంచు కుటుంబ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ అయింది. నెటిజన్లు ఈ విషయంపై పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వివాదంలో వినిపిస్తున్న కీలక పేరు వినయ్ మహేశ్వర్. అతను మంచు మనోజ్‌కు వివాదానికి ప్రధాన కారణమని మనోజ్ స్నేహితులు అంటున్నారు. వినయ్ మోహన్ బాబు ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నాడు.
మేనేజింగ్ పార్ట్‌నర్‌గా వినయ్
గతంలో అతను 2019-2022 మధ్య మీడియా సంస్థ సీఈఓగా, అలాగే ఇండియా టీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సీఈవోగా పనిచేశాడు. ప్రస్తుతం వినయ్, మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ సంస్థలో మేనేజింగ్ పార్ట్‌నర్‌గా కొనసాగుతున్నాడు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల అక్రమాల వ్యవహారంలో కూడా వినయ్ పేరు చాలా మంది దృష్టిలో పడింది. వినయ్‌కు మోహన్ బాబు విశేష భాద్యతలు ఇవ్వడం మనోజ్‌కు ఇష్టంలేకపోయిందని తెలుస్తోంది.
మనోజ్, వినయ్ మధ్య పలు వివాదాలు
ఈ కారణంగా మనోజ్, వినయ్ మధ్య పలు వివాదాలు ఉత్పన్నమయ్యాయి. గతంలో జరిగిన గొడవల్లో వినయ్, మనోజ్‌పై చేయి చేసుకోవడం, అసభ్య పదజాలం ఉపయోగించడం చర్చనీయాంశమైంది. అదేరోజు మనోజ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు, సీసీటీవీ డీవీఆర్ వినయ్ చేతిలో ఉండటం తెలుసుకొని మరింత కోపం వచ్చిందని సమాచారం.