Page Loader
Manchu Manoj: విలన్‌గా మంచు మనోజ్.. అది కూడా యంగ్ హీరో సినిమాలో?
విలన్‌గా మంచు మనోజ్.. అది కూడా యంగ్ హీరో సినిమాలో?

Manchu Manoj: విలన్‌గా మంచు మనోజ్.. అది కూడా యంగ్ హీరో సినిమాలో?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2023
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ లో యంగ్ హీరో తేజా సజ్జా(Teja Sajja) అతి త్వరలోనే హనుమాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కేవలం మూడు సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న హనుమాన్ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ రిలీజ్ అయిన ట్రైలర్ పై ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక హనుమాన్ తర్వాత తేజా సజ్జా నటించే తదుపరి చిత్రం కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ యంగ్ హీరో నటిస్తున్న కొత్త సినిమాలో మంచు మనోజ్ విలన్(Manchu Manoj) పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరక్ట్ చేస్తున్నారు.

Details

టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో చిత్రీకరణ

ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను 'మిరాయి' అని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మిరాయి అంటే జపనీస్ భాషలో 'ఫ్యూచర్' అని అర్థం. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో కూడిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌గా పేరు సంపాదించుకున్న కార్తీక్ ఘట్టమనేని 'ఈగల్' సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంక్రాతి కానుగా జనవరి 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.