Manchu Manoj : ఓటిటి షోలోకి మంచు మనోజ్ రంగ ప్రవేశం.. టైటిల్ ఏంటో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరికొత్తగా సందడి చేయనున్నాడు. ఈ సందర్భంగా కొత్తగా ఓటీటీ షోలోకి అడుగుపెట్టనున్నాడు.
ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం పేరిట సరికొత్త టాక్ షోకు మంచు యువ హీరో తెరలేపారు. త్వరలోనే మంచు మనోజ్ టాక్ షోతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు.
ఈ షో స్పెషాలిటీ ఏంటంటే, టాక్, గేమ్ రెండు షోలను కలిపి టాక్ గేమ్ షోగా రూపకల్పన చేశారు. అందుకే దీనికి ర్యాంప్ ఆడిద్దాం అని పేరు పెట్టినట్లు మంచు మనోజ్ అంటున్నాడు.
ఈ షోకు వచ్చే సెలబ్రిటీలతో ఓవైపు మాట్లాడించడం,మరోవైపు వారితో రకరకాల ఆటలు ఆడించడం రెండూ ఒకేసారి చేస్తామని చెబుతున్నాడీ మంచు కథనాయుడు.ఈ టాక్ గేమ్ షో ఈటీవీ విన్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుందన్నాడు.
details
తెలుగు టాప్ యాంకర్లతో కలిసి సందడి చేసిన మంచు మనోజ్
అయితే ఈ షోను టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతగా వ్యవరించనుంది. దీపావళి కానుకగా ఈటీవీ నిర్వహించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు కార్యక్రమానికి మంచు మనోజ్ అతిథిగా హాజరయ్యాడు.
అంతేకాదు టాప్ తెలుగు మహిళా యాంకర్లతో కలిసి ఆడిపాడాడు. ఈ కార్యక్రమంలో భాగంగానే ర్యాంప్ ఆడిద్ధాం గురించి మంచు మనోజ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
త్వరలోనే ఈ టాక్ గేమ్ షో స్ట్రీమింగ్ మొదలవుతుందన్నాడు. 2017లో ఒక్కడు మిగిలాడు సినిమా చేసిన మంచు, గత ఆరేళ్లుగా మరో చిత్రం చేయలేదు.
త్వరలోనే వాట్ ది ఫిష్ సినిమాతో అలరించనున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఇందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.ే