Manchu Manoj v/s Mohan Babu: మంచు మనోజ్ v/s మోహన్ బాబు మధ్య కుటుంబ కలహాలు.. అసలేం జరుగుతోంది..?
టాలీవుడ్ నటుడు మంచు మోహన్‌బాబు, అతని కుటుంబం మధ్య ఉన్న వివాదం ఇటీవల తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం మొదలైనప్పుడు, మంచు మోహన్‌బాబు, అతని కుమారుడు మంచు మనోజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనా నేపథ్యంలో, మంచు మనోజ్ గాయాలపాలవ్వడంతో హుటాహుటిన బంజారాహిల్స్‌లోని టీఎక్స్ ఆస్పత్రిలో చేరాడు. ఈ వివాదంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నా కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరా: మనోజ్
మనోజ్ తన ఇంటి దగ్గర హైడ్రామా నేపథ్యంలో, "నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. నా భార్యా పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. నా భార్యాపిల్లలకు రక్షణ ఉండేందుకే బౌన్సర్లను తెచ్చుకున్నా. మా బౌన్సర్లను ఎందుకు బయటకు పంపారు. నా కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరా. పోలీసులను ప్రొటెక్షన్ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారు. వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం కోసం అందరినీ కలుస్తానన్నాడు. నేను డబ్బు కోసమే, ఆస్తి కోసం పోరాటం చేయడం లేదు. నా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానన్నాడు.
మోహన్‌బాబు ఫిర్యాదులో ఏముంది?
మోహన్‌బాబు, తన కుమారుడు మంచు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని రాచకొండ సీపీకి లేఖ రాశారు. "మనోజ్ తనపై 10 మందితో దాడి చేశారని, తనకు ప్రాణహాని ఉందని" ఫిర్యాదు చేశారు. అందుకు పోలీసులను రక్షణ కల్పించాలని కోరారు. ఈ వివాదంలో మంచు విష్ణు, మంచు లక్ష్మీఎంట్రీ ఇచ్చారు. ఇక , ఈ సంఘటన ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియాల్సి ఉంది. మోహన్‌బాబు తన ఫిర్యాదులో, "పదేళ్ళుగా జల్‌పల్లిలో నివాసముంటున్నా. మనోజ్, కోడలు మౌనిక అనుచరులతో కలిసి నా కుటుంబానికి ఇబ్బందులు కల్పిస్తున్నారు. 7 నెలల కూతురిని వదిలి మనోజ్,అతని భార్య బయటకు వెళ్లిపోతున్నారు," అని తెలిపారు.
మనోజ్ ఫిర్యాదులో ఏముంది?
ఆదివారం ఉదయం 10 గంటలకు మనోజ్, 30 మంది అనుచరులు తన ఇంట్లోకి ప్రవేశించి, అక్కడున్నవారిని బెదిరించి ఇల్లు ఖాళీ చేయాలని భయపెట్టారని అన్నారు. తన ఆస్తులను కాజేసేందు కు మనోజ్ కుట్ర చేస్తున్నారని,తనకు ప్రాణహాని ఉందని,రక్షణ కావాలని ఆయన కోరారు. మంచు మనోజ్ 8వ తేదీన పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, తన ఇంట్లోకి గుర్తుతెలియని 10 మంది వ్యక్తులు దాడి చేసినట్లు, అడ్డుకోబోయినప్పుడు తనపై దాడి చేసి పారిపోయారని తెలిపారు. దీంతో, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.