LOADING...
Manchu Mohanbabu: సీఎం చంద్రబాబును కలిసిన మంచు మోహన్‌బాబు, విష్ణు 
సీఎం చంద్రబాబును కలిసిన మంచు మోహన్‌బాబు, విష్ణు

Manchu Mohanbabu: సీఎం చంద్రబాబును కలిసిన మంచు మోహన్‌బాబు, విష్ణు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2024
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, వారిద్దరూ కలిసి వరద బాధితుల కోసం రూ.25 లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. చెక్కు అందజేయడంతో పాటు, విష్ణు సీఎం చంద్రబాబుతో పలు అంశాలపై చర్చించారని తెలియజేశారు. ముఖ్యంగా ఆయన తండ్రి మోహన్‌బాబుతో కలిసి చేస్తున్న 'కన్నప్ప' సినిమా గురించి మాట్లాడినట్లు తెలిపారు.

Details

రూ.25 లక్షలు ప్రకటించిన మోహన్ బాబు

అంతేకాక, విష్ణు స్వయంగా వేసిన ఆర్ట్‌ వర్క్‌పై చంద్రబాబు సంతకం చేయించుకున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు సహాయార్ధం ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు కూడా రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించి, ఆ చెక్కును సీఎంకు అందించారు.