Page Loader
Kannappa: 'కన్నప్ప' విడుదలకు 28 రోజులు మాత్రమే మిగిలిఉంది: మంచు విష్ణు కౌంట్‌ డౌన్‌ పోస్ట్‌

Kannappa: 'కన్నప్ప' విడుదలకు 28 రోజులు మాత్రమే మిగిలిఉంది: మంచు విష్ణు కౌంట్‌ డౌన్‌ పోస్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప' విడుదలకు సిద్ధమవుతోంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో మంచు విష్ణు ప్రమోషన్ పనులకు వేగం పెంచారు. తాజాగా ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా ఒక కౌంట్‌డౌన్ పోస్టు షేర్ చేశారు.

వివరాలు 

ఇప్పటి వరకు ఎవరూ చూడని ప్రత్యేకమైన ఫుటేజ్‌

"ఇంకా 28 రోజులు మాత్రమే మిగిలున్నాయి. నేడు చెన్నైలో 'కన్నప్ప' గర్జించబోతున్నాడు. ఇప్పటి వరకు ఎవరూ చూడని కొన్ని ప్రత్యేకమైన ఫుటేజ్‌ అక్కడ ప్రదర్శించనున్నాం. భక్తి, యాక్షన్, మనసును తాకే కథతో జూన్ 27న మీ ముందుకు వస్తున్నాం" అని పేర్కొన్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో విష్ణు మరింత ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంచు విష్ణు చేసిన ట్వీట్ 

వివరాలు 

అమెరికాలో ప్రమోషన్ కార్యక్రమాలు 

ఇప్పటికే అమెరికాలో ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతం భారత్‌లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో న్యూజెర్సీ, డల్లాస్, లాస్ ఏంజిల్స్ తదితర అమెరికన్ నగరాల్లో 'కన్నప్ప'కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లిన ఘటన ఇటీవల సినిమాప్రపంచంలో కలకలం రేపింది. ఈ విషయంపై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

వివరాలు 

హార్డ్‌డ్రైవ్ దొరికిందా అన్నా?

ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్‌లు విష్ణు పోస్టుపై స్పందిస్తూ, "హార్డ్‌డ్రైవ్ దొరికిందా అన్నా?" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, ముకేశ్ రుషి, రఘుబాబు, బ్రహ్మానందం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అదనంగా ప్రభాస్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.