5.5కోట్ల కారు గిఫ్ట్ తో మరోమారు వార్తల్లో నిలిచిన మంచు విష్ణు
గత కొన్ని రోజులుగా ఏదో ఒక కారణం వల్ల వార్తల్లో నిలుస్తూ వస్తోంది మంచు ఫ్యామిలీ. మొన్నీమధ్య మంచు విష్ణు, మంచు మనోజ్ ల మధ్య గొడవలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ఆ విషయమై మోహన్ బాబు స్పందిస్తూ అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమే అని ఇలాంటి వాటిని పెద్దవి చేయాల్సిన అవసరం లేదని అన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అదంతా అటుంచితే తాజాగా మంచు విష్ణు, తండ్రి మోహన్ బాబుకు 5.5 కోట్ల కారును బహుమతిగా అందించారు.మార్చి 19వ తేదీన మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా 5.5కోట్ల రూపాయల రేంజ్ రోవర్ కారును ఆర్డర్ చేశాడట మంచు విష్ణు.
కారు ఇంటీరియర్ లో మార్పులు
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ SUVని తండ్రి కోసం బహుమతిగా అందించాడు. ఈ కారు ఈమధ్య డెలివరీ అయినట్లు సమాచారం. ఈ కారు ఇంటీరియర్ ను మోహన్ బాబుకు నచ్చే విధంగా డిజైన్ చేయించారట. మోహన్ బాబు దగ్గర ఇదివరకు టయోటా ఫార్చునర్, రేంజ్ రోవర్ వోగ్, ఆడి క్యూ 7 వంటి కార్లు ఉన్నాయి. తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమాలో కీలక పాత్రలో మోహన్ బాబు కనిపించారు. దూర్వాసముని పాత్రలో మోహన్ బాబు పాత్రకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక మంచు విష్ణు నుండి ప్రస్తుతం ఎలాంటి సినిమా అనౌన్స్ కాలేదు. మనోజ్ మాత్రం వాట్ ద ఫిష్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు.