Page Loader
Mansoor Ali : త్రిషాపై మన్సూర్ అలీ పరువు నష్టం దావా.. చివాట్లు పెట్టిన మద్రాస్ హైకోర్టు 
Mansoor Ali : త్రిషాపై మన్సూర్ పరువు నష్టందావా..చివాట్లు పెట్టిన మద్రాస్ హైకోర్టు

Mansoor Ali : త్రిషాపై మన్సూర్ అలీ పరువు నష్టం దావా.. చివాట్లు పెట్టిన మద్రాస్ హైకోర్టు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 12, 2023
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్‌ సహా ఇతర సినీ పరిశ్రమల్లోనూ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. త్రిషపై రేప్ కామెంట్స్‌ చేసిన అలీఖాన్' స్టేట్మెంట్స్'ను సెలబ్రిటీలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మహిళా సంఘాలు సైతం భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే మాన్సూర్‌పై కేసులు కూడా నమోదు చేయించాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో త్రిషకు సారీ చెప్పాడు నటుడు. అంతా సర్దుకుంది అనుకున్న సమయంలో త్రిషపై ఆయన పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన మద్రాస్ హైకోర్టు మన్సూర్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. త్రిషనే ముందుగా అలీఖాన్ పై కేసు పెట్టాల్సిందని అభిప్రాయపడ్డ న్యాయస్థానం, కేసును కొట్టిపారేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

details

మన్సూర్ అలీఖాన్'కు మొట్టికాయలు వేసిన హైకోర్టు

డిసెంబర్ 10న మన్సూర్ అలీ ఖాన్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. మీరు యాక్టర్ కాబట్టి యువత మిమ్మల్ని ఒక రోల్ మోడల్‌గా చూస్తారని హితబోధ చేసింది.సాటి నటీమణిపై సంస్కారహీనంగా మాట్లాడటం మీకు సరైనదేనా అని అసంతృప్తి వెలుబుచ్చింది. మన్సూర్ తరపున వాదించే న్యాయవాదిపై సీరియస్ అయ్యింది. పబ్లిక్ ప్రదేశాల్లో ఓ నటుడు ఎలా ప్రవర్తించాలో చెప్పమని ఆదేశించింది. ఈమేరకు తన పిటిషన్'కు విచారణ అర్హత లేదని తేల్చిన ఉన్నత న్యాయస్థానం అలీఖాన్ పిటిషన్'ను కొట్టేసింది. అంతా మన్సూర్ అలీ ఖాన్‌ వ్యాఖ్యలను ఖండిస్తుండటంతో వేరేదారిలేక సారీ చెప్పేశాడు.దీంతో త్రిష కూడా సారీని ఒప్పుకుంటున్నట్టుగా ట్వీట్ చేసింది. అంతా అయిపోయిందనుకునేలోగా అలీఖాన్ పరువు నష్టందావాతో హైకోర్టును ఆశ్రయించారు.