Amy Jackson: రెండో పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్.. కొత్త ప్రయాణం మొదలైందంటూ పోస్టు
హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆమె హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ తో ఆమె వివాహం జరిగింది. వీరి పెళ్లి వేడుక ఇటలీ ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది' అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇంతకుముందు జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో అమీ జాక్సన్ సహజీవనం చేసింది. వీరిద్దరికి అండ్రూ అనే బాబు కూడా జన్మించాడు.
రామచరణ్ సరసన నటించిన అమీ జాక్సన్
వీరిద్దరూ 2020లో వివాహం చేసుకోవాలని భావించగా, కరోనా కారణంగా ఆ వేడుక వాయిదా పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఫిలిం ఫెస్టివల్ ఎడ్ ను మొదటిసారిగా అమీ జాక్సన్ కలిశారు. ఆ సమయంలోనే వారి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. అమీ జాక్సన్ తెలుగులో ఎవడు, రోబో 2.0, ఐ వంటి చిత్రాల్లో నటించింది.