Page Loader
Funky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా టైటిల్ అనౌన్స్.. ఏంటంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా టైటిల్ అనౌన్స్.. ఏంటంటే?

Funky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా టైటిల్ అనౌన్స్.. ఏంటంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 11, 2024
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రాలతో భారీ అంచనాలు సృష్టిస్తున్నారు. ఆయన ఇటీవల విడుదలైన మెకానిక్ రాకీ చిత్రంతో మంచి స్పందన లభించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని మిశ్రమ అభిప్రాయాలు వచ్చినా, విశ్వక్ సేన్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తాజాగా ఆయన మరొక ప్రాజెక్టు గురించి ఆనౌన్స్‌మెంట్ చేసి, అభిమానుల్లో మరింత ఆసక్తి కలిగించాడు. కాగా, విశ్వక్ సేన్ తన 14వ చిత్రం గురించి చాలాకాలం క్రితం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం హాస్యభరితమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

Details

ఫంకీ అనే టైటిల్ ఖరారు

టిజి విశ్వప్రసాద్ నిర్మించే ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఇక విశ్వక్ ప్రస్తుతం లైలా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అతడు అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత, మరో రెండు ప్రాజెక్టులను కూడా స్వీకరించినట్లు సమాచారం. వాటిలో ఒకటి జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కనున్నది. ఈ కాంబో అభిమానుల్ని ఉర్రూతలూగించే హైలైట్స్‌ను అందించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. విశ్వక్ సేన్ డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను అనుదీప్ కెవి హ్యూమర్‌తో మిళితం చేస్తూ, అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాకు 'ఫంకీ' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేయగా, దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.