LOADING...
AA- Lokesh: వేసవి తర్వాత సెట్స్‌పైకి రానున్న బన్నీ-లోకేశ్‌ ప్రాజెక్ట్‌..
వేసవి తర్వాత సెట్స్‌పైకి రానున్న బన్నీ-లోకేశ్‌ ప్రాజెక్ట్‌..

AA- Lokesh: వేసవి తర్వాత సెట్స్‌పైకి రానున్న బన్నీ-లోకేశ్‌ ప్రాజెక్ట్‌..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్‌, లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే కొత్త సినిమా పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఇప్పటికే ప్రత్యేక కాన్సెప్ట్‌ వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన స్పందనను రాబట్టింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ ప్రీ-ప్రొడక్షన్‌ దశలో ఉంది. చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఈ సంవత్సరంలోనే ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు, అల్లు అర్జున్‌ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పటికే చిత్రీకరణ దశలో ఉండటంతో, లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ఈ ఏడాదిలోనే మొదలవుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

వివరాలు 

2026లో ప్రారంభం కానున్న బన్నీ - లోకేశ్‌ చిత్రం

అయితే, చిత్రబృందం 2026లోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు అధికారికంగా తెలిపింది. వేసవి కాలం అనంతరం చిత్రీకరణ ప్రారంభించి, ఇదే సంవత్సరంలో సినిమా పూర్తిచేయాలని అల్లు అర్జున్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్రబృందం చేసిన ట్వీట్ 

Advertisement