Page Loader
Bheema Movie: గోపీచంద్ భీమా ట్రైలర్ అప్‌డేట్.. ఎప్పుడంటే.? 
Bheema Movie: గోపీచంద్ భీమా ట్రైలర్ అప్‌డేట్.. ఎప్పుడంటే.?

Bheema Movie: గోపీచంద్ భీమా ట్రైలర్ అప్‌డేట్.. ఎప్పుడంటే.? 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2024
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాకో నటుడు గోపీచంద్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ ఇవ్వలేదు.కాగా,గోపీచంద్ తాజా చిత్రం భీమా. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండ‌గా.. ప్రియా భవానీ శంకర్‌,మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న గ్రాండ్‌గా విడుదల కానుంది.ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ టీజ‌ర్,రెండు సాంగ్స్‌ని విడుద‌ల చేసింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైల‌ర్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. భీమా ట్రైల‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 24 సాయంత్రం 4గంట‌ల‌కు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హీరో గోపీచంద్ చేసిన ట్వీట్