LOADING...
Matka Trailer: చిరంజీవి చేతుల మీదుగా 'మట్కా' ట్రైలర్‌ రిలీజ్
చిరంజీవి చేతుల మీదుగా 'మట్కా' ట్రైలర్‌ రిలీజ్

Matka Trailer: చిరంజీవి చేతుల మీదుగా 'మట్కా' ట్రైలర్‌ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2024
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరుణ్‌ తేజ్‌ హీరోగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'మట్కా' నవంబరు 14న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. 1960-80ల మధ్య దేశంలో చోటుచేసుకున్న యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్‌ డ్రామాను మెగాస్టార్‌ చిరంజీవి ట్రైలర్‌ విడుదల చేయడం విశేషం. ఈ సందర్భంగా చిత్రబృందానికి చిరంజీవి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రైలర్‌లోని సన్నివేశాలు, ప్రత్యేకంగా వరుణ్‌ తేజ్‌ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. 'వేలు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యుడిని కాదు, వాసుని మట్కా కింగుని' అని చెప్పిన డైలాగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Details

నవంబర్ 14న రిలీజ్

మరో డైలాగ్‌లో 'నీలాంటి మంచోళ్ల వల్ల వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, కానీ నా వంటి వాళ్ళ వల్ల కొన్ని కడుపులు నిండుతున్నాయని చెప్పిన డైలాగ్ అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ నాలుగు విభిన్న గెటప్పుల్లో నటించనున్నారు. దీనిపై అంచనాలు మరింత పెరిగాయి.