
RIP VijayaKanth: విజయ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి.. ప్రధాని మోదీ, చిరంజీవితో సహా సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ నటుడు విజయ్ కాంత్(VijayaKanth) మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎంతోమంది ప్రముఖులతో ఆయనకు సాన్నిహిత్య సంబంధం ఉంది.
ఇక విజయ్ కాంత్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో నివాళులర్పించారు.
ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, కమల్ హాసన్, బాలకృష్ణ సోషల్ మీడియాలో ఘన నివాళులర్పించారు.
విజయ్ కాంత్ ఇటు సినీ రంగంతో పాటు అటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు.
ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగు, హిందీ భాషల్లో అనువాదం అయ్యాయి.
Details
అనారోగ్యంతో మృతి చెందిన విజయ్ కాంత్
40 సంవత్సరాలకు పైగా సినీ రంగంలో రాణించారు. తర్వాత డీఎండీకే పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేశారు.
కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్ ఇవాళ చైన్నైలోని మియోట్ ఆస్పత్రిలో కన్నుమూశారు.
విజయ్‌కాంత్ మరణంపై ప్రధాని మోదీ, చిరంజీవి, కమల్ హాసన్, శరత్ కుమార్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రవి తేజ, నారా లోకేష్, మంచు విష్ణు, సోనూ సూద్, విశాల్, సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు