
Anu Kunjumon:మోహన్ లాల్ సెక్యూరిటీ నుండి సెలబ్రిటీల రక్షణ వరకు.. కేరళకు చెందిన మహిళా బౌన్సర్ అను కుంజుమోన్ ఎవరు ?
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఆయన మలయాళ చిత్ర పరిశ్రమకు చెందినప్పటికీ, తెలుగులో కూడా విపరీతమైన అభిమానాన్ని కలిగి ఉన్నారు.
మోహన్‌లాల్ నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో డబ్ అయి మంచి విజయం సాధించాయి.
తాజాగా, మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన "ఎంపురాన్" సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదలై, అద్భుతమైన స్పందనతో ముందుకు సాగుతోంది.
వివరాలు
సెలబ్రిటీలకు భద్రత కోసం బౌన్సర్లు
సెలబ్రిటీలకు భద్రత కోసం బౌన్సర్లు ఉంటారనే విషయం మనకు తెలిసిందే.
సాధారణంగా బౌన్సర్ ఉద్యోగాల్లో ఎక్కువగా పురుషులే ఉంటారు.కానీ మోహన్‌లాల్ భద్రత బాధ్యతను ఓ మహిళా బౌన్సర్ నిర్వర్తిస్తుండడం విశేషం.
ఆమె పేరు అను కుంజుమన్,కేరళకు చెందిన ప్రసిద్ధ మహిళా బౌన్సర్.
పలు సంవత్సరాలుగా ఈ రంగంలో సేవలందిస్తూ,సెలబ్రిటీల రక్షణలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
నల్లటి టీ-షర్ట్, జీన్స్ ధరించి, ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చే ఆమెను చూసిన వారిలోనే గడబిడ తలెత్తుతుంది.
కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో భద్రత నిమిత్తం హాజరైన ఆమె, ఆమె నిలబడిన తీరు, ఆజ్ఞాపించే విధానంతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రొఫెషనల్ బౌన్సర్‌గా పేరు తెచ్చుకున్న అను కుంజుమన్, ఈ రంగంలో పురుషాధిక్యతను బద్దలు కొట్టిందనే చెప్పాలి.
వివరాలు
ఫొటోగ్రాఫర్ నుండి బౌన్సర్
37 ఏళ్ల అను కుంజుమన్ ఎందుకు బౌన్సర్‌గా మారాలని నిర్ణయించుకుంది? అనేదే అందరికీ ఆసక్తికరమైన ప్రశ్న.
గతంలో ఆమె ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేది. సినిమా ప్రమోషన్ ఈవెంట్లు,సెలబ్రిటీ పార్టీలను కవరే చేయడమే ఆమె ప్రధాన ఉద్యోగం.
అయితే, ఓ కార్యక్రమంలో ఓ పురుష బౌన్సర్‌తో జరిగిన వివాదం ఆమె జీవితాన్ని మార్చేసింది.
అదే తనను బౌన్సర్‌గా మారేలా ప్రేరేపించింది. కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆమె, కుటుంబ బాధ్యతల నడుమ గౌరవంగా నిలదొక్కుకుంది.
తల్లి, సోదరికి ఆర్థికంగా తోడుగా నిలిచేందుకు అను బౌన్సర్‌గా మారింది.ఈ మేరకు,కుంజుమన్ పలు ప్రముఖ సెలబ్రిటీ ఈవెంట్స్,హై-ఎనర్జీ పబ్ పార్టీలకు భద్రత కల్పిస్తూ,వ్యాపారవేత్తలు,సెలబ్రిటీ మహిళలకు రక్షణగా నిలుస్తోంది.
ఆమె కృషి,పట్టుదల ఈ రంగంలో మరిన్ని మహిళలకు మార్గదర్శిగా నిలిచేలా చేస్తోంది.