Loading...
Mega 158: మీనాక్షి చౌదరికి మెగా ఆఫర్‌.. చిరంజీవి 'మెగా 158'లో కీలక పాత్ర?
మీనాక్షి చౌదరికి మెగా ఆఫర్‌.. చిరంజీవి 'మెగా 158'లో కీలక పాత్ర?

Mega 158: మీనాక్షి చౌదరికి మెగా ఆఫర్‌.. చిరంజీవి 'మెగా 158'లో కీలక పాత్ర?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల భామ మీనాక్షి చౌదరికి మరో క్రేజీ అవకాశం దక్కినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్టార్‌ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ హర్యానా బ్యూటీ.. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'మెగా 158'లో భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. గతంలో చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో.. వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది.

వివరాలు

కీలక ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో..

ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరి ఓ కీలకమైన అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ముఖ్యంగా సినిమాలో కీలకంగా ఉండే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఆమె పాత్ర ఉంటుందని టాక్‌.

మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో విభిన్నమైన వేరియేషన్స్‌తో ఈ ఫ్లాష్‌బ్యాక్‌ సాగుతుందని, సినిమాకు ఇదే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే మీనాక్షి పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆమె పాత్ర నిడివి వంటి అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వివరాలు

వరుస విజయాలతో దూకుడు..

2018లో 'ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్‌' రన్నరప్‌గా నిలిచిన మీనాక్షి చౌదరి.. ఆ తర్వాత గ్లామర్‌ రంగం నుంచి నటన వైపు అడుగుపెట్టారు.

'అవుట్‌ ఆఫ్‌ లవ్‌' హిందీ వెబ్‌ సిరీస్‌తో నటిగా కెరీర్‌ ప్రారంభించారు.

2021లో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత 'ఖిలాడి', 'హిట్‌: ది సెకండ్‌ కేస్‌', 'గుంటూరు కారం', 'లక్కీ భాస్కర్‌', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి చిత్రాల్లో నటించారు.

విభిన్న పాత్రలు, వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య సరసన 'వృషకర్మ' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

భారీ తారాగణంతో 'మెగా 158'

చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రియమణి, అనస్వర రాజన్‌, నివేదా పేతురాజ్‌, రచితా రామ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

విలక్షణ నటుడు మురళీ శర్మ కూడా ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

మీనాక్షి చౌదరి నిజంగానే 'మెగా 158'లో భాగమైతే.. మెగాస్టార్‌తో కలిసి నటించే అవకాశం ఆమె కెరీర్‌కు మరింత ప్లస్‌ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ADVERTISEMENT