Chiranjeevi : చిరు సరసన అయిదుగురు హీరోయిన్లు.. లోకానికొక హిరోయిన్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో మెగా హీరో చిరు ఆడిపాడనున్నారట. దేవ, దానవ, పాతాళ, యక్ష, భూ లోకాలన్నీ చిరు తిరిగి వస్తాడంట.ఓ పాప కోసం ఈ లోకాలన్నీ చుట్టొచ్చే చిరుకి లోకానికి ఒక్కరు చొప్పున మొత్తం 5 లోకాల్లో ఐదుగురు కథనాయికలతో చిందేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ఎలాగో 5 లోకాలు తిరుగుతున్నాడు కనుక లోకానికొక హీరోయిన్ ఉండాల్సిందని దర్శకుడు వశిష్ఠ భావించినట్టున్నారు. దీంతో 5 లోకాలకు గాను అయిదుగురు హీరోయిన్లను ఖరారు చేసే పనిలో దర్శకుడు నిమగ్నమయ్యారు. ఈమధ్యే అనుష్క,మృణాళ్ ఠాకూర్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.తాజాగా ఐశ్వర్యరాయ్ పేరు గట్టిగా వినిపిస్తోంది.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం
ఈ మేరకు మరో ఇద్దరు కథానాయికల వేటలో దర్శక నిర్మాతలున్నట్లు తెలుస్తోంది. అంతే బాగానే ఉన్నా ఈ అయిదుగురిలో ప్రధాన నాయిక ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. దీనికి సంబంధించి సాయిమాధవ్ బుఱ్ఱా సంభాషణలు అందించనున్నారట. గతంలో వచ్చిన విజయావారి 'జగదేకవీరుని కథ' సినిమాలో రామారావు, ఇంద్రుడి కూతురు జయంతి, నాగేంద్రుడి కూతురు నాగిని, వరుణ దేవుడి కుమార్తె వారుణి, అగ్నిదేవుడి కుమార్తె మరీచిని వివాహమాడతారు. దీంతో జగదేకవీరుడు పేరును సార్థకం చేసుకుంటాడు. జయంతి పాత్రలో బి.సరోజాదేవి ప్రధాన హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కూడా అచ్చం ఇటువంటి స్టోరీతోనే ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది.