Loading...
Chiranjeevi Birthday Special: 'Gen Z'కే కాదు.. 'Gen Alpha'కూ స్ఫూర్తినిచ్చే చిరంజీవి సినిమా.. 'ఛాలెంజ్'
'Gen Z'కే కాదు.. 'Gen Alpha'కూ స్ఫూర్తినిచ్చే చిరంజీవి సినిమా.. 'ఛాలెంజ్'

Chiranjeevi Birthday Special: 'Gen Z'కే కాదు.. 'Gen Alpha'కూ స్ఫూర్తినిచ్చే చిరంజీవి సినిమా.. 'ఛాలెంజ్'

వ్రాసిన వారు Moogati Shabari
Aug 22, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏ దేశమైనా యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది. అయితే దేశం తనకు ఏం ఇచ్చిందని ఆలోచించడం కంటే.. తనకు నచ్చిన రంగంలో పట్టుదలతో రాణిస్తూ ఎదిగితే, అది కూడా దేశాభివృద్ధికి దోహదపడినట్టే. నేటి యువత ఐటీ, స్టార్టప్స్, వ్యాపారం, కళలు.. ఇలా ఏ రంగంలో తమ సత్తా చాటినా, తమతోపాటు దేశ ఆర్థిక ప్రగతికి కూడా తోడ్పడినట్టే. ఇదే ఆలోచనను ప్రధానంగా తీసుకుని యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపిన సినిమా 'ఛాలెంజ్'. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా అప్పటి యువతకు ఎంతో ప్రేరణగా నిలిచింది. చిరంజీవి.. ఇలాంటి సందేశాత్మక సినిమాలో నటించడం ద్వారా జీవితంలో ఎదగాలనుకునే యువతకు మరింత స్ఫూర్తినిచ్చారు.

వివరాలు

అవమానాన్ని సవాల్‌గా తీసుకున్న హీరో..

ప్రస్తుతం ఉన్నట్టుగా 1980లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్దగా ఉండేవి కావు. చదువుకున్న చదువుకు తగిన అవకాశాలు ప్రభుత్వం కల్పించాలనే పరిస్థితులు ఉండేవి.

అయితే అలాంటి సమయంలోనూ యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరనే బలమైన సందేశాన్ని 'ఛాలెంజ్' సినిమా ఇచ్చింది.

నిజ జీవితంలోనూ చిరంజీవి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సినీ రంగంలోకి వచ్చి.. తనకుతానుగా ఎదిగారు.

సినిమాలో ఆయన పోషించిన పాత్రకు ఈ ప్రయాణం సరిగ్గా సరిపోయింది.

చదువు, తెలివితేటలు, పట్టుదల ఉన్న యువకుడిని ఓ డబ్బున్న అహంకారి అవమానిస్తాడు.

దీంతో ఆ అవమానాన్ని సవాల్‌గా తీసుకున్న హీరో.. ఐదేళ్లలో ఆ డబ్బును సంపాదించి, తాను అనుకున్నది సాధిస్తానని నిరూపిస్తాడు.

వివరాలు

Gen Z, Gen Alpha యువతకూ స్ఫూర్తినిచ్చే కథ

యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని కలిగించిన ఈ సినిమా.. అప్పటి యువతకే కాదు, నేటి యువతకు కూడా స్ఫూర్తినిచ్చే చిత్రంగా నిలిచింది.

ప్రస్తుత కాలానికి అన్వయించుకుంటే.. అందుబాటులోకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యువత తమ కాళ్లపై తాము ఎలా నిలబడుతున్నారో చూపించే కథగా కూడా 'ఛాలెంజ్'ను చూడొచ్చు.

లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళిక వేసుకోవడం.. ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం.. ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేయడం.. అనుకున్నది సాధించే వరకు పట్టుదలగా ముందుకు సాగడం.. ఇవన్నీ 'ఛాలెంజ్' సినిమాలో ప్రధానంగా కనిపిస్తాయి.

అందుకే ఆ సినిమా అప్పటి తరానికే కాదు.. నేటి Gen Z, రేపటి Gen Alpha యువతకూ స్ఫూర్తినిచ్చే కథగా నిలుస్తుంది.

ADVERTISEMENT