Chiranjeevi Megaverse: ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. 'మెగావర్స్' లాంఛ్ డేట్‌పై లేటెస్ట్ అప్డేట్!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ వేదికపై సరికొత్త లుక్‌లో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో టాక్ షోతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 'మెగావర్స్' (Megaverse) పేరుతో రూపొందుతున్న ఈ కార్యక్రమానికి చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ప్రముఖ సినీ తారలతో ముచ్చటించనున్న ఈ షో లాంఛ్ తేదీపై తాజాగా ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. మరోవైపు షో ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన హోర్డింగుల్లో చిరంజీవి పేరు 'N' అక్షరం లేకుండా కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
నవంబర్ 30న గ్రాండ్ లాంఛ్ ఈవెంట్?
మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నవంబర్ 30న సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌లో 'మెగావర్స్' లాంఛ్ ఈవెంట్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నెట్‌ఫ్లిక్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు హాజరుకానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 'CHIRA_JEEVI'పేరుతో భారీ హోర్డింగులను ఏర్పాటు చేశారు. షోకు సంబంధించిన తొలి ప్రోమోను కూడా త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ లాంఛ్ ఈవెంట్లోనే 'మెగావర్స్' షో ఫార్మాట్, ఎపిసోడ్ల వివరాలు, స్ట్రీమింగ్ తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాక్.
వివరాలు
గెస్ట్‌ల జాబితాలో స్టార్ హీరోలు?
ఇక 'మెగావర్స్' షూటింగ్ ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ టాక్ షోలో పాల్గొనే అతిథుల జాబితాపై కూడా ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది.
కమల్ హాసన్, నాగార్జునతో పాటు ప్రభాస్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, రవితేజ, నాని వంటి స్టార్ హీరోలు కనిపించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వీరితో పాటు హాస్యనటులు బ్రహ్మానందం, సత్య కూడా ఈ షోలో సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో పలు టెలివిజన్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులను అలరించిన చిరంజీవి.. తొలిసారి ఓటీటీ వేదికపై టాక్ షో చేయనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
వివరాలు
డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్?
'మెగావర్స్' టాక్ షో డిసెంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ షో ఫార్మాట్, గెస్ట్‌ల ఎంపిక, ఎపిసోడ్ల రూపకల్పన ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
వివరాలు
హోర్డింగుల్లో చిరంజీవి పేరులో 'N' మిస్సింగ్!
ఇదిలా ఉంటే, 'మెగావర్స్' ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హోర్డింగులు మరో చర్చకు తెరలేపాయి. వాటిపై చిరంజీవి పేరును 'CHIRA_JEEVI' అని ముద్రించారు.
సాధారణంగా ఉండే 'N' అక్షరం కనిపించకపోవడంతో అభిమానులు, సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
నెట్‌ఫ్లిక్స్ పేరులోని 'N' అక్షరంతో ముడిపెట్టి ప్రత్యేకమైన ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది.
చిరంజీవి పేరులో 'N' అక్షరాన్ని ఉద్దేశపూర్వకంగానే తొలగించారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
దీనికి సంబంధించిన అసలు కారణం నవంబర్ 30న జరిగే లాంఛ్ ఈవెంట్లో వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.