Page Loader
Sundaram Master: 'సుందరం మాస్టర్‌' ట్రైలర్‌ను ఆవిష్కరించిన మెగాస్టార్‌ చిరంజీవి 
'సుందరం మాస్టర్‌' ట్రైలర్‌ను ఆవిష్కరించిన మెగాస్టార్‌ చిరంజీవి

Sundaram Master: 'సుందరం మాస్టర్‌' ట్రైలర్‌ను ఆవిష్కరించిన మెగాస్టార్‌ చిరంజీవి 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2024
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

హాస్యనటుడు హర్ష చెముడు సుందరం మాస్టర్ సినిమాలో కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని మాస్ మహారాజ్ రవితేజ తన ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై నిర్మించారు. ఈ సినిమాకి కళ్యాణ్ సంతోష్ దర్శకుడు. ఈరోజు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ మాట్లాడుతూ...ట్రైలర్‌ చూశాక హర్షకు ఇది టైలర్‌ మేడ్‌ క్యారెక్టర్‌గా అనిపించిందన్నారు. సొంతంగా ఇండస్ట్రీకి వచ్చి.. సోషల్ మీడియాలో హర్ష చిన్న వీడియోలు,క్లిప్‌లు చేశాడన్నారు. అలా చేయడం ద్వారా హర్ష ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడన్నారు. సహ నిర్మాత సుధీర్,దర్శకుడు కళ్యాణ్ ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించారన్నారు.

Details 

హర్ష లాంటి సెల్ఫ్ మేడ్ నటులు సబ్జెక్ట్ మీద ఆధారపడి, ప్రేక్షకులను రంజింపజేయలి: చిరంజీవి

సినిమాలో ఎమోషనల్‌ అంశాలు కూడా ఉంటాయని చెప్పారు. హర్ష ఇలాంటి సినిమాలు మరిన్ని చేసి మంచి పేరు సంపాదించాలని అభిలషించారు. హర్ష లాంటి సెల్ఫ్ మేడ్ నటులు సబ్జెక్ట్ మీద ఆధారపడి, ప్రేక్షకులను రంజింపజేయగలిగితే కొత్త శిఖరాలకు చేరుకుంటారన్నారు. కొత్త రక్తంతో పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు. సుందరం మాస్టర్‌కి బ్లాక్‌బస్టర్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రముఖ నటి దివ్య శ్రీపాద ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ పాకాల అందించారు. సుందరం మాస్టర్ 23 ఫిబ్రవరి 2024న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్‌టి టీమ్‌వర్క్స్‌ చేసిన ట్వీట్