
Sundarm Master: ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల కానున్న హర్ష చెముడు 'సుందరం మాస్టర్'
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'.
ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. ఆల్రెడీ ఇది వరకు వదిలిన కంటెంట్ అందరిలోనూ ఆసక్తి కలింగించిన సంగతి తెలిసిందే.
ఒక గ్రామంలో కష్టపడే సుందరం మాస్టర్ అనే ఉపాధ్యాయుడి చుట్టూ కథ తిరుగుతుంది.
మిర్యాల మెట్ట అనే మారుమూల గ్రామంలో ఇంగ్లీషు టీచర్‌గా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అన్ని వయసుల వారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి విద్యార్థులుగా నమోదు చేసుకుంటారు, సుందరం మాస్టర్ భాషని ఎలా బోధిస్తారనే దాని గురించి వినోదాత్మక చిత్రంగా రూపొందింది.
Details
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కామెడీ డ్రామా
ఈరోజు 'సుందరం మాస్టర్' విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ కామెడీ డ్రామా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హర్ష చెముడు ప్రోమోలో నవ్వించాడు.
కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిర్యాల మెట్ట విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కామెడీ డ్రామా.
మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీపక్ ఎరెగడ సినిమాటోగ్రఫీ అందించగా, శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫిబ్రవరి 23న సుందరం మాస్టర్
#SundaramMaster in theaters on Feb 23 🤟@harshachemudu pic.twitter.com/9iDX4qu1Rv
— Cinema Mania (@TheCinemaMania) February 1, 2024