Chiranjeevi : నేను పిఠాపురం వెళ్లడం లేదు.. పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి కామెంట్స్
తన సోదరుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నపిఠాపురం నియోజకవర్గంలో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్డీయే,టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఎన్నికల సమయంలో ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు బదులిచ్చారు. "నేను పిఠాపురం వెళ్ళడం లేదు.పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచారం చేయమని నన్ను ఎప్పుడూ కోరలేదు.పవన్ కళ్యాణ్ బాగుండాలని,ఆయన రాజకీయ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను.తమ్ముడికి అండగా ఉన్నానని చెప్పేందుకే ఓ వీడియోను విడుదల చేస్తున్నాను" అని ఆయన వివరించారు. దివంగత నటుడు,మాజీ సీఎం నందమూరి తారకరామారావు భారతరత్నకి అర్హుడని అన్నాడు మెగాస్టార్ చిరంజీవి.