Page Loader
రజనీకాంత్ జైలర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసారా? 
జైలర్ సినిమాను చిరంజీవి రిజెక్ట్ చేసారని వార్తలు

రజనీకాంత్ జైలర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసారా? 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 22, 2023
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజై కలెక్షన్ల సునామీని సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ రిటైర్డ్ జైలర్ గా కనిపించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. అయితే మీకిది తెలుసా? జైలర్ సినిమా కథను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మొదటగా మెగాస్టార్ చిరంజీవికి వినిపించారని వార్తలు వస్తున్నాయి. జైలర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించాలని నెల్సన్ దిలీప్ కుమార్ అనుకున్నారట. ఈ మేరకు కథను కూడా వినిపించారట. కానీ జైలర్ కథ మెగాస్టార్ కి నచ్చలేదని, సినిమాలో పాటలు లేకపోవడం వల్ల మెగాస్టార్ చిరంజీవి జైలర్ కథను రిజెక్ట్ చేశారని అంటున్నారు.

Details

సోషల్ మీడియాలో వెల్లువలా వస్తున్న వార్తలు 

అయితే ఈ విషయంలో ఎంత మేరకు నిజముందనేది ఎవరికీ తెలియదు. కానీ జైలర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసారని సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అదలా ఉంచితే, ఆగస్టు 10వ తేదీన రిలీజైన జైలర్ సినిమా 650కోట్ల వసూళ్లను రాబట్టగలిగింది. తమిళంలోనే కాదు తెలుగులో కూడా జైలర్ సినిమా పెద్ద మొత్తంలో వసూలు చేయగలిగింది. ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ యాక్తర్ జాకీ ష్రాఫ్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాలో తెలుగు నటుడు సునీల్ ఒకానొక పాత్రలో మెరిసారు.