Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పుతోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో చిరంజీవికి జోడీగా తమిళనాడు లేడి సూపర్ స్టార్ నయనతారను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. అందులో 'వచ్చే ఏడాది సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం' అని నయన్‌తో కలిసి అనిల్ రావిపూడి చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Details
గతంలో స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార, చిరంజీవి
గతంలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాల్లో చిరుతో జతకట్టిన నయనతార, ఈ సినిమాతో మళ్లీ ఆయనతో స్క్రీన్‌షేర్ చేయనుంది. అనిల్ రావిపూడి ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారని సమాచారం. చిరు అభిమానులను ఆకట్టుకునేలా 'వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్' అన్న టాక్ టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. నయనతార ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె పారితోషికంగా ఏకంగా రూ. 18 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ మల్టీ స్టారర్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.